రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో నేటి నుంచి చేపట్టిన మెగా ఇళ్ల నిర్మాణ గ్రౌండింగ్ మేళాలో మొదటి రోజైన గురువారం ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించడంలో రాష్ట్రంలోనే మన జిల్లా టాప్‌గా నిలిచిందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ వెల్లడించారు. జిల్లాకు మొదటి రోజున 8,918 ఇళ్ల లక్ష్యాన్ని కేటాయించగా లక్ష్యానికి మించి 21,370 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించి 239.63శాతం ఇళ్ల నిర్మాణాలతో జిల్లా మొదటిస్థానంలో నిలిచిందన్నారు. 175.53శాతం ఇళ్ల గ్రౌండింగ్ తో చిత్తూరు ద్వితీయ స్థానంలోనూ, 144.70శాతం లక్ష్య సాదనతో విశాఖపట్నం తృతీయ స్థానంలో నిలిచాయి. మెగా మేళా తొలిరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషిచేసిన ప్రజాప్రతినిధులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లను జిల్లా కలెక్టర్ అభినందించారు.