శ్రీనివాసరావు సేవలు మరువలేనివి..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-07-01 13:43:18

విశాఖ సెట్విస్ సీఈఓ గా  బి. శ్రీనివాసరావు మరువలేని సేవలు అందించారని  సమాచార శాఖ ఉపసంచాలకులు వి. మణిరామ్ కొనియాడారు.  శ్రీనివాసరావు బదిలీ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఈఓగా నూతనంగా నియమితులైన పీ.వీ. రమణ ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.  శ్రీనివాసరావు  తమకు అధికారిగా పని చేసిన కాలంలో  అందరితో స్నేహభావంతో పనులు చేయించుకునే వారని సిబ్బంది కొనియాడారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మేనేజరు నుండి పదోన్నతి పొంది ముఖ్య కార్యనిర్వహణాధికారి, విశాఖపట్నం గా బాధ్యతలు స్వీకరించిన   పి.వి.రమణకు కార్యాలయ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.