ఖాళీ స్థలాలను పార్కులుగా మార్చండి..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-07-01 14:22:18

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఖాళీ స్థలాలను పార్కులుగా అభివృద్ధి పరచాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఇంజినీరింగు అధికారులను ఆదేశించారు. గురువారం ఆమె జివిఎంసి ప్రధాన ఇంజినీరు రామకృష్ణ రాజు, ఎ.డి.హెచ్., పర్యవేక్షక ఇంజినీరులు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో తేది.15.08.2021లోపు ప్రజలకు ఉపయోగ పడే విధంగా అన్ని ఖాళీ ప్రదేశాలలో వాకింగ్ ట్రాక్ లు, ట్రీ ప్లాంటేషన్ లు పూర్తీ చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకు రావాలని, అక్టోబర్ నెలలోపు నగరంలో 10 “థీం” పార్కులు అభివృద్ధి పరచాలని, వాటిలో ప్రజలకు ఆహ్లాదంతో పాటు, విజ్ఞానం అందించే విధంగా బటర్ ఫ్లై పార్కు, ట్రాఫిక్ సిగ్నల్ పార్కు, వ్యాయామ పార్కు, హెర్బల్ గార్డెన్ పార్కు, పాల్మ్స్ పార్క్, అరోమా ట్రీ పార్క్, రైన్ బో ట్రీ పార్క్ మొదలగు వివిధ రకాల పార్కులు అభివృద్ధి పరచి ప్రజలకు అందుబాటులోనికి తీసుకు రావాలని ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులతో తయారవుతున్న నాడు-నేడు పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో 42 పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను కొత్తగా నిర్మించి 4 నెలలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, విచ్చేయు సందర్భంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రారంభోత్సవానికి అందుబాటులోనికి ఉంచాలని తెలిపారు.