సొంతింటి కల వైఎస్సార్సీపీతో సాధ్యం..


Ens Balu
6
విశాఖ సిటీ
2021-07-01 15:22:06

నిరుపేదల సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహనరెడ్డి నెరవేరుస్తున్నారని మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. గురువారం నగరంలోని 5వ జోన్ 54వ వార్డు పరిధిలోని  ఆశవాని పాలెంలో నగర మేయర్ జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలిసి పేదల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం వైఎస్.జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాల్లో భాగంగా జివిఎంసి పరిధిలో ఇంకా 3844 ఇళ్లు కట్టించాల్సి వుందన్నారు. వాటి నిమిత్తం నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉండి, ఇల్లు నిర్మించుకోలేని వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి రోజు జివిఎంసి అన్ని జోన్ లలో  కలిపి 1388 ఇళ్లకు భూమిపూజ చేయడం జరిగిందని, మిగిలినవి ఈ నెల 3, 4 తేదీలలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ఇల్లు నిర్మించుకొనుటకు కావలసిన సామగ్రిని ప్రభుత్వమే సమకూరుస్తుందని, నిర్మాణ సామాగ్రి ఏ ప్రాంతంలో లభిస్తుందో పూర్తి వివరాలు లబ్ది దారులకు తెలిజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యుటీ మేయర్ జియ్యాని శ్రీధర్, పశ్చిమ నియోజక వర్గ సమన్వయ కర్త   డా. మల్లా విజయ ప్రసాద్, వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, ఐదవ జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, కార్య నిర్వాహక ఇంజినీర్లు రత్నాల రాజు, శ్రీనివాస్ (వాటర్ సప్ప్లై), చిరంజీవి (మెకానికల్), ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ ఏడుకొండలు, ఎఎంఒహెచ్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.