తక్కువ ధరకే ఆక్సిజన్ యంత్రాలు..


Ens Balu
2
Srikakulam
2021-07-02 13:58:25

శ్రీకాకుళం జిల్లాలోని  ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అవసరం వున్నవారు రెడ్ క్రాస్ కార్యాలయంలో సంప్రదించాలని జిల్లా చైర్మన్ చైర్మన్ .పి.జగన్ మోహన్ రావు తెలియజేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాఖ ద్వారా సింగపూర్ రెడ్ క్రాస్ సొసైటీ,  ఉత్తర అమెరికా తెలుగు సంఘం,  అమెరికన్ అసోసియేషన్ అఫ్ ఫిజిషియన్ అఫ్ ఇండియన్ ఆరిజన్ సౌజన్యంతో సమకూర్చిన  ఆక్సిజన్ సరఫరా 21 ఆక్సిజన్ యంత్రాలు వివిధ బాధితులకు సమకూర్చామన్నారు. అత్యవసరం అయినవారు తమను సంప్రదిస్తే అతి తక్కువ ధరకే వాటిని అంస్తామన్నారు. మరిన్ని వివరాలకు కో ఆర్డినేటర్ బి.శ్రీధర్ 9100078581 లో సంప్రదించాలన్నారు.