పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే పూర్తి..


Ens Balu
2
Srikakulam
2021-07-02 14:03:52

శ్రీకాకుళం జిల్లాలో పెండింగులో గల సాగునీటి ప్రోజెక్టులను వెంటనే పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో  జిల్లా సాగునీటి వనరులపై ఉప ముఖ్యమంత్రి  ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసన సభాపతి తవ్మిునేని సీతారాం లతో కలసి అధికారులతో  సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నిర్మాణంలో గల సాగునీటి ప్రోజెక్టుల పనుల పురోగతిపై అధికారులు  వివరించారు. వంశధార ప్రోజెక్టు కు సంబంధించి అత్యవసరంగా కావలసిన షట్టర్స్, లస్కర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించుటకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు.  87, 88 ప్యాకేజీ పనులను పూర్తి చేసి డిసెంబరు నాటికి ప్రోజెక్టు  పూర్తి చేయాలని తెలపారు. సమావేశానికి ప్రత్యేక అతిధిలుగా హాజరైన ఉప ముఖ్యమంత్రి  ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ ప్రోజెక్టులను పూర్తిచేయుటకు అవసరమైన నిధులకు నివేదికలు తయారుచేసి వెంటనే విడుదల చేయాలన్నారు.  రాష్ట్ర శాసన సభాపతి తవ్మిునేని సీతారాం మాట్లాడుతూ వంశధార కాలువలపనులు రెండువైపులా త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు.  జిల్లా కలెక్టరు శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రోజెక్టుల పూర్తిచేయుటకు కృషిచేస్తున్న మంత్రులకు కృతజ్ఞతలు తెలయజేస్తూ ప్రోజెక్టులు పనులు త్వరితగతిన పూర్తిచేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. 

                పాలకొండ శాసనసభ్యులు విశ్వాసరాయి కళావతి మాట్లాఢుతూ తమ నియోజక వర్గంలో గల పెండింగు ప్రోజెక్టులను త్వరగా పూర్తిచేయాలని కోరారు. జంపరకోట రిజర్వాయరు పూర్తిచేయాలని, సి.డబ్య్లు.ఎస్. ప్రోజెక్టు కింద మంచినీటి సరఫరా, చానల్స్ కు ఉపాధిహామీ అనుసంధానం చేయాలని, బామిని మండలానికి లిప్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు  దువ్వాడ శ్రీనివాసరావు,   శాసనసభ్యులు కంబాల జోగులు, రెడ్డి శాంతి, డి.సి.సి.బి. మాజీ అద్యక్షలు పాలవలస విక్రాంత్,   సాగునీటి పారుదల శాఖ  నార్త్ కోస్టల్ చీఫ్ ఇంజనీరు ఎస్. సుగుణాకరరావు, జిల్లా ఎస్.ఇ. డోల తిరుమలరావు,  డిసిసిబి మాజీ అధ్యక్షులు పాలవలస విక్రాంత్, తదితర అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.