భూమి పూజలకు సిద్దం కావాలి..


Ens Balu
1
GVMC office
2021-07-02 14:06:20

మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో ఇంకనూ కట్టవలసిన ఇళ్ల భూమి పూజకు సిద్ధం కావాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన జోనల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ప్రాజెక్ట్ డైరెక్టర్ (హౌసింగ్), అందరు జోనల్ కమిషనర్లు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, వార్డు ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూలై 3వ తేదీన జివిఎంసి పరిధిలో మిగిలిన 2900ల పేదల ఇళ్లకు భూమిపూజ పూర్తి స్థాయిలో చేయాలని, అనివార్య కారణాల వలన ఎవరైనా లబ్ధిదారులు మిగిలి ఉంటే వారికి 4వ తేదీన శంకుస్థాపనకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం మంజూరు చేసిన ఇల్లు పనులను నిర్లక్ష్యం చేయకుండా పనులు ప్రారంభించి పేదలకు గూడు కట్టించడంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే మనమే ప్రథమ స్థానంలో నిలవాలని  అధికారులను ఆదేశించారు.