పక్కాగా కాపు నేస్తం లబ్దిదారుల ఎంపిక..


Ens Balu
3
Vizianagaram
2021-07-02 14:08:39

విజయనగరం జిల్లాలో జూలై 1 నుంచి వారం రోజుల పాటు కాపు నేస్తం పధకానికి సంబంధించి నిర్వహించే లబ్దిదారుల గుర్తింపు కార్యక్రమం  జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్  ఒక ప్రకటనలో తెలిపారు. జూలై 24న కాపు నేస్తం పధకం క్రింద కాపు, బలిజ, ఒంటిరి, తెలగ కులాలకు చెందిన అర్హులయిన లబ్దిదారులకు రెండవ విడతగా రూ. 15 వేలును ముఖ్యమంత్రి విడుదల చేస్తారన్నారు.  ఇందుకు సంబంధించి లబ్దిదారుల ఎంపిక జూలై 1 నుండి 7 వరకు జరపాల్సివుందన్న కలెక్టర్ హరిజవహర్ లాల్ 45 నుండి 60 సంవత్సరాలలో వున్న అర్హులయిన మహిళా లబ్దిదారులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు.  గ్రామ వాలంటీర్లు మొబైల్ అప్లికేషన్స్ లో లబ్దిదారుల వివరాలు సేకరించాలన్నారు.  గత సంవత్సరం ఎంపికై లబ్దిదారులలో 60 సంవత్సరాలు పూర్తైన లబ్దిదారులను తొలగించాలని,  కొత్తవారికి నమోదు జూన్ 24 నాటికి 45 సంవత్సరాలు నిండివుండాలని తెలిపారు.  ఎంపిక చేసిన లబ్దిదారుల పరిశీలన జూలై 8 నుండి 13 వరకు చేయాలని 14న అర్హుల తుదిజాబితాను సామాజిక తనిఖీ కోసం ప్రదర్శించాలని, అభ్యంతరాల స్వీకరణ, విచారణ అనంతరం అర్హుల తుదిజాబితాను నిర్థారించి ఎంపిడిఓలు, మునిసిపల్ కమిషర్ల ద్వారా తనకు పంపాలన్న కలెక్టర్ తన ఆమోదం అనంతరం ఆయా ప్రతిపానలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాల్సివుందన్నారు.   జిల్లాలో కాపునేస్తం పధకంలో భాగంగా మొదటి విడతలో 5464 మంది లబ్దిదారులుకు  రూ. 8.19 కోట్లు విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.