తిరుమల స్థాయిలో అభివృద్ధి చేసుకోవాలి..
Ens Balu
3
Simhachalam
2021-07-02 14:20:40
సింహాచలం శ్రీశ్రీ శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి దేవస్థానం ప్రతిష్ట పెంచి తిరుమల స్థాయిలో అభివ్రుద్ధి చేసుకునేందుకు అటెండర్ నుంచి ఈఓ వరకు అందరూ క్రమశిక్షణతో కష్టపడి పనిచేయాలని ఈఓ ఎంవీ సూర్యకళ పిలుపునిచ్చారు. శుక్రవారం ఈ మేరకు దేవాలయంలో సిబ్బంద, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సిబ్బంది నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించారు. సింహాచలం దేవస్థానం, తిరుపతి శ్రీవేంకటేశ్వారస్వామి ఆలయం స్థాయిలో అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఉద్యోగులు ఎంతో ఆదర్శంగా ఉండాలని ఆమె సూచించారు. దేవస్థానం ఉద్యోగులు ఎవరినైనా దర్శనాలకు పింపిస్తే కచ్చితంగా టికెట్ తీసుకోమని చెప్పాలన్నారు. తిరుపతిలాగే అందరిటీ టికెట్ నిబంధనను అమలు చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆదాయ వనరులను పెంపొందించి అభివృద్ధికి పాటుపడాలని ఈఓ హితవు పలికారు. భక్తులకు సౌకర్యాలు కల్పించివారు సంతృప్తి చెందితే ఖచ్చితంగా దేవస్థానం అభివృద్ధిచెందుతుందన్నారు. శనివారాలు, పర్వ దినాల్లో ట్రాఫిక్ నియంత్రణ నుంచి ప్రసాదాల పంపిణీ వరకు అన్ని అంశాలపైనా ద్రుష్టిసారించినట్టు ఆమె చెప్పారు. భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు ఉద్యోగులు మరింత కష్టపడి పనిచేయాలన్నారు. దాతలను ప్రోత్సహించి దేవస్థానం అమలుచేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్జిత సేవల గురించి ఉద్యోగులు వివరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.