మాన్సాస్ విషయంలో రాజు జైలుకే పక్కా..


Ens Balu
1
వైఎస్సార్సీపీ ఆఫీస్
2021-07-03 10:00:53

పరిపాలన రాజధానిగా ఎదుగుతున్న విశాఖ అభివృద్ధిని చూసి ఓర్వలేక తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవాకులు చెవాకులు పేలుతున్నరని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 39వార్డు కార్పొరేటర్ మహమ్మద్ సాదిక్ ఆరోపించారు. శనివారం మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  కొంతమంది టిడిపి నేతలు తమ స్థాయిని మరిచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయి రెడ్డి పై ప్రేలాపనలు పేలుతున్నరన్నారు. ఇప్పటికైనా వారి స్థాయిని గుర్తించుకొని మరోసారి ఇలాంటి ఆరోపణలు చేయొద్దని సూచించారు. విశాఖలో భూములను దోచుకున్న తెలుగుదేశం నాయకుల చరిత్రను ప్రజలకు తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. విజయనగరం మాన్సాస్  భూముల కుంభకోణంలో అశోక్ గజపతిరాజు జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఆడవారికి ఇస్తున్న సముచిత స్థానాన్ని కించపరుస్తూ టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే విశాఖ ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. ఇప్పటికైనా తెలుగుదేశం నేతలు మేల్కొని స్థాయిని బట్టి స్పందించాలని హితవుపలికారు. టీడీపీ మైనార్టీ నేత నజీర్ మరో బికాం లో ఫిజిక్స్ అన్నా ఒక నేత మాదిరిగా అవగాహన లేని నేతలా మాట్లాడుతున్నారని 2ప్లస్2 ఎంత అంటే 22 అనే రకం అని ఈయన మరో బికాం లో ఫిజిక్స్ నేత మారారు హాస్యాస్పదం గా వర్ణించారు.  ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్  మహమ్మద్ ఇమ్రాన్ , కో ఆప్షన్ సభ్యులు  షరీఫ్  తో పాటు నగరానికి చెందిన ముస్లిం నేతలు హాజరయ్యారు.