వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు..


Ens Balu
2
Srikakulam
2021-07-03 11:17:32

రాబోయే సీజన్ లో వ్యాధులు ప్రబలకుండా నివారణకు చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర రావు వైద్యాధికారులు ఆదేశించారు.    వచ్చేది వర్షా కాలం సందర్భంగా వ్యాధుల నివారణ కార్యక్రమంపై జిల్లా జాయింట్ కలెక్టర్లు, డిఎంహెచ్ఓలు, వైద్యాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  వ్యాక్సినేషన్ శత శాతం చేయాలన్నారు. డయోరియా, మలేరియా, డెంగ్యూ, తదితర వ్యాధులు రాకుండా నివారించేందుకు చర్యలు, వ్యాధులు వచ్చినా వాటిని కట్టడి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లలులో ఎనీమియా లేకుండా చూడాలని, వారికి బలమైన ఆహారం సరఫరా చేసేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలన్నారు.  కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా మొదట డెలివరీకి రెండవ డెలివరీలకు మద్య ౩ సంవత్సరాలు గ్యాప్ ఉండాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతీ నెల డెలివరీలకు సంబంధించిన రిపోర్టులు సబ్ సెంటర్లు నుంచి శత శాతం అప్ లోడ్ చేయించాలని ఆదేశించారు. వై.యస్.ఆర్. క్లినిక్స్ లో భవనాలు నిర్మాణాలు పూర్తి అయితే 14 రకాలు పరీక్షలు, 24 వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. PHC లకు వారానికి ఒకసారి ఒక స్పెషలిస్టు వెళ్లాలని సూచించారు. టుబాకో ప్రోగ్రాం, టిబి కంట్రోల్ ప్రోగ్రామ్, తదితర కార్యక్రమాలు, వ్యాదులపై ఆయన వివరించారు.

కోవిడ్ - 19 మూడవ దశకు ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలని, ప్రైవేటు ఆసుపత్రులను ఇప్పటి నుండే సందర్శించి సమన్వయం చేసుకోవాలన్నారు. ఆక్సిజన్ నిల్వ, సరఫరాలపై ఎపిఎంఐడితో సమన్వయం చేసుకోవాలని, ఆసుపత్రుల్లో పడకలు, సిబ్బంది, ఆక్సిజన్, తదితర వాటిని చూసుకోవాలని పేర్కొన్నారు.  నోడల్ అధికారులు ఆసుపత్రులకు రోజూ వెళ్లే విధంగా చూడాలని చెప్పారు. ఫీవర్ సర్వే పక్కాగా ఇంటింటికి వెళ్ళి చేయాలన్నారు. నిర్లక్ష్యం చేయకూడదని ఆయన అన్నారు. కోవిడ్ కేర్ కేంద్రాలు, ప్రైమరీ, సెకండరీ కాంట్రాక్టు లను గుర్తించాలని తెలిపారు. ఇప్పటి నుండే సిద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు వైద్యాధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను డిశంబరు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ ఒక్కటీ పెండింగ్ లో ఉండరాదని ఆయన స్పష్టం. జిల్లా నుండి వీడియో కాన్పరెన్స్ లో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, అదనపు డిఎంహెచ్ఓ బి. జగన్నాధరావు, టిబి కంట్రోల్ అధికారి ఎన్. అనూరాధ, తదితరులు పాల్గొన్నారు.