సేంద్రీయ ఎరువుల తయారీపై అవగాహన..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-07-03 12:21:39

మహావిశాఖ నగర పరిధిలోని మహిళలకు సేంద్రీయ ఎరువు తయారీపై  అవగాహన పెంచాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులు ఆదేశించారు. శనివారం ఆమె రెండవ జోన్ ఐదవ వార్డు పరిధిలోని మడురవాడ, గణేష్ నగర్ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సేంద్రీయ ఎరువు తయారు చేయు పద్దతులను మహిళా సంఘాల ద్వారా మహిళలకు అవగాహన పెంచాలని, ఇంటిలో వాడే కాయగూరల తొక్కలు, పండ్లు తొక్కలను ఉపయోగించి సేంద్రీయ ఎరువు తయారుచేయు విధానాన్ని తెలపాలని అన్నారు. గణేష్ నగర్ లో ఒక గృహిణి సేంద్రీయ ఎరువు తయారు చేయు పద్దతిని పరిశీలించి, ఆమెను అభినందించారు. ఈమెను ఆదర్శంగా చేసుకొని మరికొంత మందిని సేంద్రీయ ఎరువు తయారీకు ప్రోత్సహించాలని, డోర్ టు డోర్ చెత్త సేకరణ చేస్తున్నదీ లేనిదీ స్థానిక ప్రజలను అడిగి తెలుసుకున్నారు. తడి-పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, ప్రతీ రోజు పారిశుధ్య సిబ్బంది వస్తున్నదీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. వార్డులో మంచి నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు శుద్ధి చేసిన త్రాగు నీరు అందించాలని, గడువులోపు కొళాయి కనక్షనులు ఇవ్వాలని, సహాయక ఇంజినీరు(వాటర్ సప్ప్లై)ను  ఆదేశించారు.  వార్డులో పందులు అధికంగా ఉన్నాయని, వాటిని వెంటనే తొలగించాలని వెటర్నరి డాక్టరును ఆదేశించారు. రానున్న వర్శాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని సీజనల్ వ్యాదులైన మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు ప్రబల కుండా ముందు జాగ్రత చర్యలు తీసుకోవాలని, ఇళ్ళ పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూడాలని, వారంలో ఒక్క రోజు “డ్రై” డే పాటించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఎఎంఒహెచ్ కిషోర్ ను ఆదేశించారు. ఈ పర్యటనలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, రెండవ జోనల్ కమిషనర్ బి.రాము,   కార్యనిర్వాహక ఇంజినీర్లు చిరంజీవి (మెకానికల్), శంకర్(వర్క్స్), శ్రీనివాస్(వాటర్ సప్ప్లై), ఎఎంఒహెచ్ / వెటర్నరి డాక్టరు కిషోర్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ వంశీ, సహాయక ఇంజినీరు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.