రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ జగనన్న కాలనీలలో అన్ని రకాల మౌలిక వసతులను కల్పించి సుందరమైన గ్రామాలుగా తీర్చిదిద్దనున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం పాయకరావుపేట మండలం పి ఎల్ పురం గ్రామంలో మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళా కార్యక్రమం లో మంత్రి పాల్గొని గృహ నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. పాయకరావుపేట శాసనసభ్యులు గొల్ల బాబూరావు మాట్లాడుతూ ఇల్లు లేని అర్హులైన ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల సాకారం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. పాయకరావుపేట నియోజక వర్గంలో సుమారు 5218 మంది అర్హులైన లబ్ధిదారులకు 102 లేఅవుట్ లలో ఇళ్ల స్థలాలను కేటాయించడం జరిగింది. పాయకరావుపేట మండలం పీఎల్ పురంలో 1233 మంది లబ్ధి దారులకు ఇళ్ళ స్థలాలను మంజూరు చేశారు. మెగా గ్రౌండింగ్ హౌసింగ్ మేళాలో నర్సీపట్నం ఇంచార్జ్ ఆర్ డి ఓ ,అనిత, పాయకరావుపేట ప్రత్యేకఅధికారి విశ్వేశ్వరరావు,హౌసింగ్ డి ఇ మల్లికార్జున, తాసిల్దర్ సత్యనారాయణ,ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.