అప్పన్న ఆలయంలో భద్రత కట్టుదిట్టం..
Ens Balu
4
Simhachalam
2021-07-03 13:00:32
విశాఖలోని సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ (సింహాద్రి అప్పన్న)స్వామి వారి దేవస్థానంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ఇక్కడ పనిచేసే గార్డుల వద్ద మొబైల్ -మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆలయంలోకి మొబైల్స్ పోన్స్ తీసుకెళ్లడం నిషేధించారు. వాటిని భద్రపరిచేందుకు ఆలయం వద్దే కౌంటర్లు ఏర్పాటుచేశారు. అయినా కొంతమంది భక్తులు తెలియక మొబైల్స్ స్విచాఫ్ చేసి బ్యాగుల్లో వేసి తీసుకెళ్లడం దేవస్థానం ఈఓ సూర్యకళ స్వయంగా తెలుసుకున్నారు. దీంతో సెక్యూరిటీ గార్డులను డిటెక్టర్లు ఇచ్చి దేవస్థానం లోపల మొబైల్ నిషేధాన్ని తప్పకుండా అమలుచేయాలని ఆదేశించారు. శనివారం వీటి పరిశీలన మొదలైంది. ఆలయ ఏఈఓ రాఘవ కుమార్ స్వయంగా వాటిని తనిఖీ చేశారు. మొబైల్స్ తో ఎవర్నీ లోపలకు వదలొద్దని భద్రతా సిబ్బందిని, క్యూలైన్ల దగ్గరున్న పోలీసులను ఆదేశించారు.