రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ జూలై 5 నుంచి జిల్లాలో పర్యటించనున్నట్టు జిల్లా కలెక్టర్ డా.ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. జిల్లా కలెక్టర్ వెల్లడించిన వివరాల ప్రకారం పురపాలక మంత్రి 4వ తేదీ ఆదివారం రాత్రి 9 గంటలకు విజయనగరంలోని తన నివాసానికి చేరుకుంటారు. 5న ఉదయం 11 గంటలకు నగరంలోని మునిసిపల్ కార్పారేషన్ కార్యాలయం రెండు, మూడో అంతస్థులను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3-00 గంటలకు చీపురుపల్లిలో మోడల్ డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తారు. చీపురుపల్లి మండలం కర్లాంలో సొసైటీ భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఇదే గ్రామంలో ఇంటింటికీ తాగునీటి సరఫరా చేసే పథకాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం విజయనగరం చేరుకుంటారు. 6న బొబ్బిలి నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు తెర్లాం మండలం పెరుమాలిలో, 11 గంటలకు బొబ్బిలి మండలం పారాదిలో గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభిస్తారు. కార్యక్రమాల అనంతరం మధ్యాహ్నం విజయనగరం చేరుకుంటారు. 7,8 తేదీల్లో జిల్లాలో ఏర్పాటయ్యే కార్యక్రమాల్లో పాల్గొంటారు.