రాష్ట్ర ప్రభుత్వం పట్టణ పురపాలక శాఖల్లో- ఏర్పాటు చేసిన వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శులకి ఇచ్చిన జాబ్ చార్ట్ ప్రకారం విధులు నిర్వర్తించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. జి.ఒ.నెం.650 ప్రకారం వార్డు శానిటరీ కార్యదర్శులకు కొన్ని విధులు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముఖ్యంగా సచివాలయం పరిధిలో కనీసం 3 గంటలు అవుట్ డోర్ వర్క్ లకు వెళ్లడం, తడి-పొడి చెత్త 100% సేకరణ చేయించడం, బహిరంగ ప్రదేశాల్లో, కమ్యూనిటీ హాల్ లోనూ, ప్రజా మరుగుదొడ్లు మొదలైన చోట్ల పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు. ఆన్ లైన్ బల్క్ వెస్ట్ మేనేజ్మెంట్ సిష్టం అమలు, ప్రతి ఇంట్లో, బయట వేస్ట్ జనరేటర్ లకు అవసరమైన సాంకేతిక సహాయం అందించాలన్నారు. సేంద్రియ ఎరువుల తయారుచేయు పద్ధతుల పై మహిళలకు అవగాహన కల్పించడంతోపాటు రోడ్లపై పశు సంచారం లేకుండా చూడాలన్నారు. సచివాలయ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రిలోని రోగులకు వివరాల సేకరణ, నిషేధిత ప్లాస్టిక్ ను అమ్మకాలు జరగకుండా చూడాలని, లైన్ డిపార్ట్మెంట్ వారితో కలసి వెస్ట్ మేనేజ్మెంట్ అమలుకు అవసరమైన సమాచారం ఇవ్వాలన్నారు. నగరంలో 100% చెట్లు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు వార్డులోని సమస్యలను అధికారులకు తెలియజేయాలన్నారు. వారికి ప్రభుత్వం 15 సాధారణ సెలవులు, పబ్లిక్ సెలవులు వర్తిస్తాయని అన్నారు. వార్డు శానిటేషన్, పర్యావరణ కార్యదర్శులు వారి విధి నిర్వహణ నిమిత్తం జివిఎంసి లోని ప్రజా ఆరోగ్య శాఖకు అనుసంధానం చేయబడ్డారన్నారు. వారంతా కేటాయించిన విధులు ప్రకారం ఉదయం 6 గంటల నుంచి పనివేళలు మొదలవుతాయని కమిషనర్ స్పష్టం చేశారు.