అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు..


Ens Balu
3
Srikakulam
2021-07-03 15:04:45

శ్రీకాకుళం జిల్లాలో ఆరోగ్యశ్రీ నిబంధనలను అతిక్రమించి అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సంయుక్త కలెక్టర్, ఆరోగ్యశ్రీ అదనపు ముఖ్యకార్యనిర్వహణాధికారి డా. కె.శ్రీనివాసులు హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ నిబంధనలు ఉల్లంఘించి వసూళ్లకు పాల్పడిన రాగోలు జెమ్స్ ఆసుపత్రి అధికారులపై కఠిన చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన జారీచేసారు. జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పౌందిన పేషెంట్ నుండి డబ్బులు వసూలు చేసినట్లు రుజువైనందున జిల్లా క్రమశిక్షణ కమిటీ ద్వారా వసూలు చేసిన డబ్బులు కంటే పదిరెట్లు అధికంగా ఒక లక్షా ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల పది రూపాయలు ( రూ.1,29,410/-లు ) జరిమానా విధించినట్లు జె.సి తెలిపారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స పొందిన వారి దగ్గర నుండి ఆసుపత్రి వర్గాలు ఎటువంటి వసూళ్లకు పాల్పడరాదని, పాల్పడినట్లు రుజువైతే ఆయా ఆసుపత్రుల అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.