రాజమండ్రి పాత బ్రిడ్జికి అల్లూరి పేరు..
Ens Balu
2
Rajahmundry
2021-07-03 15:25:40
తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి-కొవ్వూరు పాత వంతెనకు ప్రభుత్వం శ్రీ అల్లూరి సీతారామరాజు వంతెనగా నామకరణం చేయాలని ప్రభుత్వం యోచిస్తుందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వంతెన ఫోటో పెడుతూ, కోట్స్ రాశారు. 2021వ సంవత్సరానికి అల్లూరి జన్మించి 124 సంవత్సరాలు పూర్తవుతుంది. నాటి నుంచి నేటి వరకూ అల్లూరి పేరుతో చారిత్రక చిహ్నాలు ఏమీలేవు. 74ఏళ్ల స్వాంత్ర్య భారత దేశంలో తెల్లవాడిని మట్టికరిపించి తెలుగువాడి పౌరుషాన్ని ప్రదర్శించిన అల్లూరి ఏ ప్రభుత్వమూ సముచిత స్థానాన్ని ఇవ్వలేదు. ఆయన పేరు, జీవిత చరిత్రతో మ్యూజియం, క్రిష్ణదేవిపేట, విశాఖ జిల్లాలను అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా మారుస్తామన్నహామీలు కూడా నెరవేరలేదు. కానీ ఎప్పుడో బ్రిటీషు కాలంలో నిర్మించిన కొవ్వూరు-రాజమండ్రి వంతెనకు మాత్రం అల్లూరి పేరు పెడుతున్నట్టు ప్రకటించడం నేడు చర్చనీయాంశం అవుతుంది.