మెగా గ్రౌండింగ్ లో జిల్లానే ప్రథమం..
Ens Balu
3
Srikakulam
2021-07-04 10:22:58
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశించిన మెగా హౌసింగ్ గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో 200 శాతానికి పైగా ఇల్లు నిర్మాణాలను ప్రారంభించి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్ వెల్లడించారు. ఈ మెగా గ్రౌండింగ్ మేళా కార్యక్రమం విజయవంతం కావడానికి వాలంటీరు దగ్గర నుండి అధికారుల వరకు నిర్విగ్నంగా కృషిచేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లాలో ఈ కార్యక్రమం చాలా గొప్పగా నిర్వహించేందుకు మార్గ నిర్దేశం చేసిన జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్, సంయుక్త కలెక్టర్లు డా.కె.శ్రీనివాసులు, ఆర్.శ్రీరాములు నాయుడు, గృహ నిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్ హిమాంశు కౌశిక్ లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనే శ్రీకాకుళం జిల్లాలో ఇంత భారీస్థాయిలో ఈ కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా కేంద్ర కార్యాలయం నుండి ప్రత్యేక అభినందనలు లభించాయని చెప్పారు. జూలై 3న పొన్నాడలో నిర్వహించిన గ్రౌండింగ్ మేళా కార్యక్రమంలో ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ వీడియో కాలింగ్ ద్వారా నేరుగా లబ్దిదారులతో మాట్లాడి జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లను తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తపరిచారని చెప్పారు. లబ్ధిదారులు ఇంకా ఎవరైనా ముందుకు వస్తే వాటిని కూడా గ్రౌండింగ్ చేయించి ఇదే వేగంతో, ఇదే స్ఫూర్తితో భూమి పూజ మొదలుపెట్టి ఇల్లు పూర్తయ్యేంత వరకు భాద్యత వహించాలని జిల్లా కలెక్టర్ ఆశీస్తున్నారని, ఆయన ఆశయ సాధనకు అందరు అధికారుల సహకారంతో ఈ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాష్ట్రంలో జిల్లాను గౌరవ ప్రధమైన స్థానంలో నిలిపి ప్రభుత్వం నిర్దేశించిన 92 వేల గృహాలను పూర్తిచేసి , ఫేజ్ - 2 క్రింద మిగిలిన 30 వేలు గృహాలను కూడ తీసుకువచేందుకు కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.