అల్లూరి ఆశయ సాధనకు కృషి..


Ens Balu
2
Srikakulam
2021-07-04 10:25:00

స్వాతంత్య్ర సమరయోధులు, అగ్గిపిడుగు అల్లూరి సీతారామరాజు ఆశయ సాధనకై ఈ ప్రభుత్వం కృషిచేస్తుందని గృహనిర్మాణ శాఖ సంయుక్త కలెక్టర్ హిమాంశు కౌశిక్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు 124వ జయంతి వేడుకలు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఘనంగా జరిగాయి. తొలుత అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి జె.సి,  రెవిన్యూ సిబ్బంది పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లూరి పోరాట స్ఫూర్తి అందరికి ఆదర్శమని, అతి చిన్న వయసులోనే మహోజ్వల శక్తిగా అల్లూరి ఎదిగారని కొనియాడారు. ఆయన చేసిన సాయుధ పోరాటం స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని అభివర్ణించారు. ఆయన స్పూర్తితో భగత్ సింగ్ వంటి వీరులు ముందుకు వచ్చారని గుర్తుచేశారు. గిరిజన హక్కుల కోసం ఆయన చేసిన పోరాట స్ఫూర్తి ఇప్పటికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని గిరిజనులకు విద్య, వైద్యంతో పాటు సమాన హక్కులు, ఆర్.ఐ.డి.ఎఫ్ పట్టాలు, ఇళ్ల పట్టాలు, గృహానిర్మాణాలు  వంటి కార్యక్రమాలను ప్రతీ సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలో ఒక ఐ.ఏ.ఎస్ అధికారి ద్వారా చేపడుతున్నట్లు వివరించారు. అల్లూరి వంటి మహనీయులు గిరిజనుల అభివృద్ధి కోసం ఏమి ఆశించారో వాటన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పథక సంచాలకులు టి.వేణుగోపాల్, కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి సిహెచ్.రాజేశ్వరరావు, ఇతర అధికారులు, కలెక్టర్ కార్యాలయ విభాగాల పర్యవేక్షకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.