మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 124వ జయంతి సందర్భంగా ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన యోధులలో అల్లూరి ఒకరని తెలిపారు. మన్యం ప్రజల హక్కుల కోసం, వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం చివరికి వారి ప్రాణాలను రక్షించడానికి తన ప్రాణాలు సైతం అర్పించి మన్యం గుండెల్లో గిరిపుత్రుల జీవితాల్లో అల్లూరి సీతారామరాజు శాశ్వతంగా నిలిచిపోయారన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా, రెవెన్యూ ) ఏ.ఎస్. దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్ (ఆసరా , సంక్షేమం) కే శ్రీధర్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కొండయ్య, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారిణి దుర్గాబాయి, ఎస్‌ఎస్‌ఏ పీవో యం.వెంకటప్పయ్య, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు అమర సుబ్బయ్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.