విజయనగరం కార్పొరేషన్ పరిధిలోని రెండు సచివాలయాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాతబస్టాండ్, నాగవంశపు వీధి సమీపంలోని 25,26 సచివాలయాలను ఆయన సందర్శించి, అటెండెన్స్ రిజిష్టర్‌ను తనఖి చేశారు. మూవ్‌మెంట్ రిజష్టర్‌ను పరిశీలించారు. ఆన్‌లైన్ వినతులు, ఇతర పెండింగ్ పనులపై వాకబు చేశారు. ఆయా డివిజన్లలో అమలు జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను తెలుసుకున్నారు. సిబ్బంది అంతా సకాలంలో విధులకు హాజరు కావాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మూవ్‌మెంట్ రిజిష్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. వచ్చిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, పరిష్కరించలేని వాటిని, అందుకు గల కారణాలను అర్జీదారునికి తెలియజేయాలని కలెక్టర్ సూచించారు.