పందుల సంచారాన్ని అరికట్టండి..
Ens Balu
4
విశాఖ సిటీ
2021-07-05 14:52:45
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి సోమవారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజనతో కలసి ఐదవ జోన్, 70వ వార్డు పరిధిలోని చట్టివానిపాలెం, శ్రీనివాస నగర్, ఎర్ర గెడ్డ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైవే పై ఉన్న ఎలెక్ట్రికల్ పోల్స్ ను తొలగించి సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. వార్డులో పందులు అధికంగా ఉన్నాయని, వాటిని ఈ రోజే తొలగించాలని ప్రధాన వైధ్యాదికారిని ఆదేశించారు. చట్టివానిపాలెం లోని కాలువలు, రోడ్డులు “ఐలా” వారి అధీనంలో ఉన్నాయని, “ఐలా” కమిషనర్ ను సంప్రదించి రోడ్డులు, కాలువలు శుభ్రం చేసేలా మాట్లాడతానని వార్డు కార్పొరేటర్ కు తెలిపారు. రోడ్డు మధ్య భాగంలో భూగర్భ డ్రైనేజ్ కొరకు తవ్విన గోయ్యలను సరిగా పూడ్చక పోవడంతో రోడ్డు గుంటలుగా ఉన్నాయని, వాటిని వెంటనే పూడ్చి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. మహిళా సంక్షేమ భవనం ఆవరణలో ఉన్న ఖాళీ స్థలంలో పార్కు, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని, అంగడివాడి సెంటర్ ను ప్రాధమిక ఆరోగ్య కేంద్రంగా ఉపయోగిస్తున్నందున, అంగన్వాడి కేంద్రాన్ని మరో చోటుకు మార్చాలని, శ్రీనివాస్ కాలనీ, ఎర్రగెడ్డ ఏరియాలో మంచినీటి పైపు లైను వేయాలని కార్పొరేటర్ మేయర్, కమిషనర్ కు తెలుపగా, వాటిని పరిశీలిస్తామని, మంచినీటి పైపు లైను కు ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో 70వ వర్డు కార్పొరేటర్ ఉరుకూటి రామచంద్ర రావు, వార్డు వై.ఎస్.ఆర్.సి.పి. ఇంచార్జ్ తిప్పల దేవాన్ రెడ్డి, ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జోనల్ కమిషనర్ శ్రీధర్, కార్యనిర్వాహక ఇంజినీర్లు ప్రసాద్ బాబు, చిరంజీవి, వెంకట రావు, శ్రీనివాస్, ఉప కార్యనిర్వాహక ఇంజినీర్ తదితర అధికారులు పాల్గొన్నారు.