నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-07-05 14:55:08

మహా విశాఖ నగరపాలక సంస్థ నాలుగవ జోన్ పరిధిలోని భీమ్ నగర్ లో ఉన్న 210, 212, టీఎస్ఆర్ కాంప్లెక్స్ లో 214, 215 ఉన్న వార్డు సచివాలయాలను సోమవారం జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయ కార్యదర్శులు హాజరు పట్టి, వారి జాబ్ చార్టును, డైరీని, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకే అన్ని సంక్షేమ పధకాలు అందించాలనే ఉద్దేశ్యంతో వార్డు సచివాలయ వ్యవస్థ ను ప్రవేశ పెట్టడం జరిగిందని, దానిని కార్యదర్శులు నిర్లక్ష్యం చేయకుండా ప్రజలకు సంక్షేమ పధకాలు అందించాలని తెలిపారు. కార్యదర్శులు వారి జాబ్ చార్టు అధాఎఅమ్గా విధులు నిర్వహించాలని చేసిన పనిని వెంటవెంటనే డైరీలో పొందుపరచాలని, బయటకు విధులు నిర్వర్తించుటకు వెళ్ళినప్పుడు మూమెంట్ రిజిస్టర్ లో పూర్తి వివరాలు వ్రాయాలని, కార్యదర్శులు సచివాలయంలో ఉండి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను, ఆర్జీలను పెండింగులో ఉంచకుండా వెంటనే నమోదు చేసి పై అధికారికి పంపాలని, శానిటరీ కార్యదర్శులు కనీసం మూడు గంటలు వార్డులో పర్యటించి డోర్ టు డోర్ చెత్త సేకరణ, కాలువలు, రోడ్డ్లు శుభ్రం చేయించాలని తెలిపారు. ఏ వార్డులో ఉండవలసి సచివాలయాలు అదే వార్డులో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని జోనల్ కమిషనర్  బి.వి.రమణ ను ఆదేశించారు. 

సిఫార్సు