లెత చారిటబుల్ ట్రస్ట్ సరుకుల వితరణ..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-07-05 14:58:53

నిరుపేదలకు తమవంతు సేవలందిస్తున్న  విశాఖలోని “లెత చారిటబుల్ ట్రస్ట్” సేవలు మరువలేనివని జివిఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి అన్నారు. సోమవారం సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా  2వ జోన్ 12వ వార్డు లోని నెహ్రూ నగర్ లో అరవై పేద కుటుంబాలకు రూ.2500లు విలువ చేసే సామగ్రిని ఆమె పంపిణీ చేశారు.  మేయర్ మాట్లాడుతూ కరోనా వలన చాలా పేద కుటుంబాలకు పనులు లేక రోడ్డున పడుతున్నారని వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపైన ఉందని తెలిపారు. పేద కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిన లేదా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శివారెడ్డిని ఆమె అభినందించారు. నిరుపేదలను ఆదుకోవడానికి మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మేయర్  పిలుపు నిచ్చారు.  చారిటబుల్ ట్రస్ట్ లకు ప్రభుత్వం తరఫున సహకారం అందించడానికి తాము ముందుంటామని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో “లెత  చారిటబుల్ ట్రస్ట్” సభ్యులు శివారెడ్డి, వార్డ్ కార్పొరేటర్ అక్రమాని రోహిణి, వైసిపి వార్డ్ అధ్యక్షులు సుబ్బారెడ్డి, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు.