మార్కెట్ విలువ ప్రకారం అద్దెలు వసూలు..
Ens Balu
4
GVMC office
2021-07-05 15:05:42
నగరంలో మార్కెట్ విలువ ప్రకారం దుకాణాల అద్దెలు వసూలు చేయాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన రెవిన్యూ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె డి.సి.ఆర్., జోనల్ కమిషనర్లు, రెవెన్యూ ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు జివిఎంసి ఆదాయం పెంపునకు కృషిచేయాలని, ప్రతి జోన్ లో ఉన్న దుకాణాలు అద్దె మార్కెట్ విలువ ప్రకారం ఉండాలని, దుకాణాలలో లీజు గడువు దాటిన వారు ఉన్నయెడల, అలాంటి గుత్తేదారులను గుర్తించి, వారికి తొలగింపు నోటీసు ఇచ్చి ఖాళీ చేయించాలన్నారు. దుకాణాలను వేలంపాటలో దక్కించుకున్న గుత్తేదారులు, ఇతరులకు అద్దెకి ఇస్తున్న వారని గుర్తించాలని, కాలపరిమితి దాటిన గుత్తేదారులును ఖాళీ చేయించి, మరలా కొత్తగా వేలంపాట నిర్వహించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గుత్తేదారులు దుకాణాల కాల పరిమితి దాటినా కూడా జివిఎంసికి అద్దె చెల్లించకుండా ఉన్నవారిని తొలగింపు నోటీసు ఇచ్చి ఖాళీ చేయించాలని ఆదేశించారు. కోర్టులో పెండింగు లో ఉన్న కేసులను మినహాయించి మిగిలిన వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రెవెన్యూ అధికారి జివిఎంసికి రావాల్సిన బకాయిలను వసూలు చేసి ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు.