ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలి..


Ens Balu
2
Guntur
2021-07-05 15:36:17

పర్యావరణ సమతుల్యతకు, మానవాళీ మనుగడకు మొక్కలు ప్రధాన ఆధారమవుతాయని, ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని  జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్  ముందు ఉన్న పార్క్ నందు  జర్నలిస్ట్,  సామాజిక కార్యకర్త సురేశ్ బాబు,  ఎస్.ఎన్..జి ఫౌండేషన్ ఛైర్మన్ కందుల శారదా వాణి ల  ఆద్వర్యంలో అందించిన మొక్కలను జిల్లా కలెక్టర్  వివేక్ యాదవ్,  సంయుక్త కలెక్టర్ ( రైతు భరోసా- రెవెన్యూ) ఏ.ఎస్ దినేష్ కుమార్, సంయుక్త కలెక్టర్(సచివాలయాలు- అభివృద్ధి), ప్రశాంతి,  సంయుక్త కలెక్టర్ ( ఆసరా- సంక్షేమం) శ్రీధర్ రెడ్డి, సంయుక్త కలెక్టర్ (గృహనిర్మాణం) అనుపమ అంజలి, డి.ఆర్.వొ కొండయ్య నాటి వాటికి నీటిని అందించారు.   ఈ  సందర్భంగా జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ మాట్లాడుతూ వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా వర్షాకాలంలో ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా మొక్కలు నాటాలని పిలుపు నిచ్చారు. మొక్కలు పెంచడం ద్వారా ప్రతీ ఒక్కరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుతూ ఆరోగ్యవంతంగా జీవించవచ్చునని జిల్లా కలెక్టర్ తెలిపారు.  ఈ కార్యక్రమంలో  ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ వినాయకం, గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి యాస్మిన్, జడ్పీ సీఈవొ చైతన్య, డి.ఆర్. డి.ఏ పి.డి ఆనంద నాయక్, డ్వామా పి.డి శ్రీనివాసరెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారులు, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.