విశాఖ నగరంలో రిలయన్స్ ఫౌండేషన్ సహకారంతో ధాన్ ఫౌండేషన్ మూడు రోజుల నుంచి 3వేల మాస్కులు పంపిణీ చేసినట్టు నిర్వాహకులు కె.రమాప్రభ తెలియజేశారు. ఈ మేరకు సోమవారం మీడియాకి ప్రకటన విడుదల చేశారు. నగరంలోని 4 సమాఖ్యల పరిధిలో వున్న 80 వార్డు సచివాలయాలలో 1000 మంది ఆటో సిబ్బందికి, 1000 మంది డొమెస్టిక్ వర్కర్స్, 1000 మంది వీధి వర్తకులకు పంపిణీ చేసినట్టు అందులో వివరించారు. మొదటి విడతగా 3000 మాస్కులను అందజేశామని విరవించిన సంస్థ రిలయన్స్ ఫౌండేషన్ లాక్ డౌన్ పీరియడ్ లో కూడా ధాన్ ఫౌండేషన్ కి డ్రై రేషన్ కిట్లు పేద ప్రజలకు ఇచ్చామని పేర్కొంది. ఆరిలోవ, ఎస్ ఐ జి నగర్, పెద్ద జాలారి పేట, ఎఫ్ ఎం సి, మల్కాపురం, శ్రీహరిపురం, ప్రసాద్ గార్డెన్స్, కొబ్బరితోట, వెలంపేట ఏరియాలలో ఈ పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో సమాఖ్య జీవనోపాధి అసోసియెట్లు ఆది లక్ష్మి, అరుణ, సూర్య కుమారి హెల్త్ అసోసియేట్ దేవి , అసోసియేట్ లు పాల్గొన్నట్టు ప్రకటనలో తెలియజేశారు.