ఈనె 8న ఘనంగా రైతు దినోత్సవం..


Ens Balu
2
Vizianagaram
2021-07-06 12:03:02

స్వర్గీయ డా. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 8 న రైతు దినోత్సవాన్ని  ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రైతుకు పంటల పై, ఎరువులు, విత్తనాల, పురుగు మందులు పై  అవగాహన పెంచడానికి   ఈ నెల 9 నుండి  రైతు చైతన్య యాత్రలను నిర్వహించాలన్నారు.  రైతు భరోసా కేంద్రాల్లో, మండల, జిల్లా స్థాయి లో వ్యవసాయ సలహా మండలి సమావేశాలు జరపాలన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి మంగళ వారం స్పందన పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి  కోవిడ్, ఖరీఫ్ సన్నద్ధత, ఉపాధి హామీ, సచి వాలయాల తనిఖీ, అర్బన్ క్లినిక్స్, హౌసింగ్ గ్రౌండింగ్స్, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ పట్టాలు తదితర అంశాల పై సమీక్షించారు.   రాష్ట్రంలో  కోవిడ్ పొజిటివిటీ రేట్  2.89 శాతానికి తగ్గిందని, ఇందు కోసం పని చేసిన జిల్లా కలెక్టర్ నుండి ఆశ వర్కర్, వాలంటీర్ వరకు అందరికి అభినందనలని అన్నారు. అయితే ఫీవర్ సర్వే మాత్రం నిరంతర జరగాలని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఉండాలని అన్నారు.  ఈ నెలలో కాపు నేస్తం జగనన్న ప్రారంభాలు ఉన్నాయని, వీటి కోసం అర్హులైన  లబ్ది దారులను  ఎంపిక చేయాలని ఆదేశించారు. ఉపాధిహామీ పనుల్లో  17.18 కోట్ల పనిదినాలు కల్పించి జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ  వీడియో కాన్ఫరెన్స్ లో   జిల్లా నుండి  జిల్లా కలెక్టర్ డా.ఎం.హరి జవహర్ లాల్,   సంయుక్త  కలెక్టర్ (రైతు భరోసా మరియు రెవెన్యూ) డా.జి.సి.కిశోర్ కుమార్, సంయుక్త  కలెక్టర్ (హౌసింగ్) మయూర్ అశోక్,  జాయింట్ కలెక్టర్ (సంక్షేమం) జె.వెంకట రావు ,  డి.ఆర్.ఓ గణపతి రావు,అగ్రికల్చర్ జెడి ఆశా దేవి, సిపిఓ విజయ లక్ష్మి, డి ఎంహెచ్ఓ డా.రమణ కుమారి తదితరులు పాల్గొన్నారు.