కోవిడ్ వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీవై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పై మంగళవారం తాడేపల్లిలోని సి.ఎమ్. క్యాంపు కార్యాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి వీక్షణ సమావేశం నిర్వహించారు. కోవిడ్ మూడవ దశను సమర్థంగా ఎదుర్కోవడానికి అవసరమైన ఏర్పాట్లతో పాటు వైద్యులను సిద్ధం చేసుకోవాలని కలెక్టర్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి సూచించారు. కోవిడ్ రెండవ దశలోనూ వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారి, కలెక్టర్ వరకు అందించిన సేవలు సాహోసోపేతమైనవని ఆయన ప్రశంసించారు. కోవిడ్ సోకిన వారికి ఆరోగ్యశ్రీ క్రింద మెరుగైన వైద్యం అందేలా సి.సి. కెమేరాల నిఘా పెంచాలన్నారు. ప్రజలు దోపిడికి గురికాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కలెక్టర్ల పై ఉందన్నారు. ఈ నెల ఎనిమిదవ
తేదీ నుంచి 23వ తేదీవరకు రైతు చైతన్య యాత్రలు వైభవంగా నిర్వహించాలన్నారు. e-క్రాపింగ్ విధానంపై కలెక్టర్లు ప్రత్యేక ద్యాస పెట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా బహుళ ప్రయోజనాలు రైతులకు కల్పించడం, అన్ని విధాల మేలు జరి గేలా చూడాలన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు - క్రాపింగ్ నూతన విధానంపై సలహా మండలి సమావేశాలు విధిగా నిర్వహించాలన్నారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ప్రకాశం జిల్లాలో మరింత పురోగతి సాధించేలా జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. కోవిడ్ విపత్తు సమయంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేస్తూ ఉపాధిహామి పథకం కింద పేదోడికి పనులు కల్పించడం అభినందనీయమన్నారు.
ఉపాధి హామీ పనులు జిల్లాలో బాగా చేశారని, 85 శాతం పురోగతి సాధించడంపై కలెక్టర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా కలెక్టర్లు,
జిల్లా సంయుక్త కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు ప్రతివారం సచివాలయాలను తనిఖీలు చేయాలన్నారు. ఇంటి స్థలాలు కావాలని దరఖాస్తులు చేసుకున్న 90 రోజులలోనే ఇంటి పట్టాలు కేటాయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు కార్యక్రమాలలో భాగంగా గృహనిర్మాణాలను అధికశాతం ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. గిరిజనులకు పంపిణి చేసిన అటవీ భూమి
అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెలలో వై.ఎస్.ఆర్. రైతుదినోత్సవం, వై.ఎస్.ఆర్. కాపునేస్తం, జగనన్న విద్యాదీ వెన పథకాలకు లబ్దిదారుల జాబితాను ముందుగానే సచివాలయాలలో ప్రకటించాలన్నారు. సమావేశంలో జిల్లానుంచి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జె.సి.లు జె. వెంకట మురళి, టి.ఎస్. చేతన్, కె.ఎస్. విశ్వనాథన్, కె. క్రిష్ణ వేణి, డి.ఆర్.ఓ. డి. తిప్పే నాయక్, సి.పి.ఓ, డి. వెంకటేశ్వర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.