ప్రతీ దుకాణం ముందు మూడు రంగుల చెత్త డబ్బాలు ఉండేలా చూడాలని జివిఎంసి అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు శానిటరీ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఎనిమిదవ జోన్ 90వ వార్డులోని బుచ్చిరాజు పాలెం, సుసర్ల కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ దుకాణాల ముందు మూడు రంగుల చెత్త డబ్బాలు ఉండాలని, లేని యెడల వారి వద్ద నుండి అపరాధ రుసుం వసూలు చేయాలని, నిషేదిత ప్లాస్టిక్ అమ్మ కుండా చూడాలని ఆదేశించారు. ప్రతీ ఇంటినుండి చెత్త సేకరణను పరిశీలించి, పారిశుధ్య సిబ్బందికి తగు సూచనలిచ్చారు. తడి-పొడి మరియు ప్రమాధకరమైన చెత్తనూ వేరు వేరుగా తీసుకోవాలని, రోడ్డ్లు, కాలువలు ఎప్పటికప్పుడు శుభ్ర పరిచి, చెత్తను డంపింగు యార్డుకు తరలించాలని, పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం వహించరాదని సిబ్బందిని హెచ్చరించారు. దోమలు నివారణకు చర్యలు చేపట్టాలని, వీదులలో ఫాగింగు చేయాలని తెమీ పాస్ ద్రావం నిల్వ ఉన్న నీటి కుండీలలో కలపాలని, పరిసరాలను పొడిగా ఉండేలా చూడాలని, డస్ట్ బిన్లు, లిట్టర్ బిన్లను శుభ్రపరచాలని, బహిరంగ ప్రదేశాలలో చెత్త వేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ చక్రధర్, శానిటరీ సూపర్వైజర్ అప్పారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొనారు.