ఉపాధిహామీ పథకం అనుసంధాంతో చేపడుతున్న అభివృద్ధి పనులలో మరింత పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. అభివృద్ధి కార్యక్రమాలపై మంగళవారం స్థానిక ప్రకాశం భవనంలోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విరివిగా మొక్కలు నాటించాలని కలెక్టర్ చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమీక్షించే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సచివాలయాలు, ఆర్.బి. కె.లు, వై.ఎస్.ఆర్. హెల్త్ క్లినిక్ లు, బి.ఎమ్.సి.యు.లు భవనాల నిర్మాణం వేగంగా పూర్తి చేయాలన్నారు. పునాది స్థాయిలో ఉన్న భవనాలకు సాంకేతిక అడ్డంకులు తొలగించేలా చూడాలన్నారు. సచివాలయాల భవన నిర్మాణాలపై అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. ప్రతి సోమవారం మండల స్థాయి అధికారులతో సమీక్షించుకోవాలన్నారు. నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు కార్యక్రమంలో గృహాల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా ప్రోత్సహించాలన్నారు. లేఅవుట్లలో సమస్యలుంటే తక్షణమే పరిష్కరించాలని, కోర్టు పరిదిలోని స్థలాల పరిష్కరానికి చర్యలు తీసుకోవాలన్నారు. గృహాల మ్యాపింగ్, జియో
ట్యాగింగ్ తప్పనిసరిగా చేయాలన్నారు.
వై.ఎస్.ఆర్. భరోసా పథకం కింద అర్హులైన లబ్దిదారులందరికి సకాలంలో పింఛన్ పంపిణి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. పింఛన్ పంపిణికి అవసరమైన యంత్రాలలో సాంకేతిక
పరమైన సమస్యలు రాకుండా చూడాలన్నారు. నాడు-నేడు కార్యక్రమాలను పర్యవేక్షించాలని ఆయన పలు సూచనలు చేశారు. సమావేశంలో జె.సి.లు జె. వెంకట మురళి, టి.ఎస్. చేతన్, కె.ఎస్. విశ్వనాథన్, కె.క్రిష్ణవేణి, డి.ఆర్.ఓ. డి. తిప్పే నాయక్, వ్యవసాయ శాఖ జె.డి. శ్రీనివాసరావు, పి.ఆర్. ఎస్.ఇ. కొండయ్య, డ్వామా పి.డి. శీనారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.