8న ఆరెండు ప్రాజెక్టుల నీటి విడుదల..


Ens Balu
1
Srikakulam
2021-07-06 13:08:40

శ్రీకాకుళం జిల్లాలోని తోటపల్లి ఓల్డు రెగ్యులేటర్, మడ్డువలస రిజర్వాయర్ నుంచి ఈ నెల 8వ తేదీన ఖరీఫ్ కు నీటిని విడుదల చేయాలని నిర్ణయించామని జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజనీరు పి.సుధాకర రావు తెలిపారు. తోటపల్లి పాత రెగ్యులేటర్ నుండి విడుదల చేసే నీటి వలన  వీరఘట్టాం, పాలకొండ, వంగర మండలాలకు చెందిన 31,708 ఎకరాలకు సాగు నీరు అందుతుందని ఆయన వివరించారు. మడ్డువలస రిజర్వాయర్ ప్రాజెక్టు నుండి విడుదల చేసే నీటి వలన వంగర, రేగిడి ఆమదాలవలస, సంతకవిటి, పొందూరు, జి.సిగడాం మండలాలకు చెందిన 24,877 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుందని ఆయన చెప్పారు. సాగు నీరు సాఫీగా సరఫరా అగుటకు సంబంధిత కార్యనిర్వాహక ఇంజనీర్లు తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రెండు ప్రాజెక్టుల నుండి సాగు నీరు ఖరీఫ్ కు విడుదల అంశాన్ని రైతులు గమనించి నీరు వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.