అప్పన్నకు SEZ కమిషనర్ పూజలు..
Ens Balu
1
Simhachalam
2021-07-06 13:19:19
విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్ డెవలప్మెంట్ కమిషనర్ ఏ. రామ మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా మంగళవారం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహబస్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన అప్పన్నకు ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం కప్ప స్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ సిబ్బంది స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆలయ సిబ్బంది వివరించారు. దేవస్థానంలో తిరిగి ఆలయ శిల్పకళా సంపదను సందర్శించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.