అప్పన్నకు రూ.50వేలు విరాళం..


Ens Balu
5
Simhachalam
2021-07-06 13:23:47

విశాఖలోని పెద వాల్టేర్ డాక్టర్స్ కాలనీకి  చెందిన విశ్వనాధం సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామివారికి మంగళవారం రూ.50,000 (యాభై వేలు) విరాళంగా ఇచ్చారు. ఈమేరకు ఆలయ సిబ్బందికి పీఆర్వో ఆఫీసు కౌంటర్ లో చెక్ అందించారు. ఈ సందర్భంగా దాత మాట్లాడుతూ, జనవరి 12న తన పేరుతో అన్నదానం చేయాలని కోరారు. గతంలోనూ విశ్వనాథం స్వామివారికి రూ.50,000 విరాళంగా ఇచ్చారు. అనంతరం దాతలకు ఆలయ అధికారులు స్వామివారి దర్శనం కల్పించి, ప్రసాదాన్ని అందజేయగా.. వేద పండితులు ఆశీర్వచన కల్పించారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.