అక్షయ పాత్ర సేవలు శ్లాఘనీయం..


Ens Balu
3
విశాఖ సిటీ
2021-07-06 14:47:41

విశాఖ జిల్లా కోవిడ్ రెండవ దశ వ్యాప్తి సమయంలో ఐదు లక్షల ఆహార పొట్లాలను పేదలకు అందించి వారి ఆకలి తీర్చిందిని జివిఎంసి మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కొనియాడారు. అక్షయపాత్ర ఫౌండేషన్ వారు ఈ సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీ నుంచి కోవిడ్ రోగులకు వారి సహాయకులు, నిరాశ్రయులకు రోజుకు  25 కేంద్రాల ద్వారా 5,000 ఆహార పొట్లాలు   ప్రతీరోజూ పంపిణీ చేశారని, కొన్ని పేద కుటుంబాలకు 5,000 నిత్యావసర సరుకులు అందించారని మేయర్ తెలిపారు. ఎక్కడ పేద ప్రజలు ఆకలితో ఉన్నారో వారి ఆకలిని తీర్చడం కోసం పురాణాలలో పేర్కొన్న అక్షయపాత్ర పేరుకు తగ్గట్టుగా వారి ఆకలి తీరుస్తుందని తెలిపారు. ఇటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్. నిష్క్రించిన భక్త దాస్ కు మరియు వారి వాలంటీర్లకు జివిఎంసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్షయ పాత్ర ఫౌండేషన్ సేవలను నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించాయని, పేదలను ఆదుకోవడానికి మరిన్ని స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేశారు.