ఆరు లైన్ల రహదారి అభివృద్ధికి చర్యలు..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-07-06 14:50:06

ఆరు లైన్ల రహాదారి అభివృద్ధి కోసం ప్రతిపాదనలు తయారుచేయాలని రోడ్లు, భావనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు తెలిపారు. మంగళవారం  జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన, వి.ఎం.ఆర్.డి.ఎ. కమిషనర్ కోటేశ్వరరావు, రెవెన్యూ అధికారులతోను వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ అభివృద్ధిలో భాగంగా పలు ప్రాజెక్టుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. విశాఖ పోర్టు నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రహదారి కొరకు ప్రతిపాదనలు తయారు చేయాలని ఆదేశించారు. జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన ఇప్పటివరకు రహదారుల అభివృద్ధి పై చేసిన సర్వే వివరాలను ముఖ్య కార్యదర్శికి తెలియపరిచారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జివిఎంసి ప్రధాన ఇంజినీరు రవి కృష్ణంరాజు, చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత, పర్యవేక్షక ఇంజినీరు గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.