మెప్మా పీడిగా రవికుమార్..
Ens Balu
2
Ongole
2021-07-06 15:06:16
ప్రకాశం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్ట్ డైరెక్టర్ గా తేళ్ల రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఉలవపాడు ఎంపీడీవోగా పనిచేస్తున్న రవికుమార్ ను మెప్మా పీడీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతలు చేపట్టిన ఆయన వెంటనే ప్రకాశం భవనానికి చేరుకుని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. గతంలో డి.ఆర్.డి.ఏ. ఏపీడీగా రెండేళ్లు పని చేసిన విషయాలను జిల్లా కలెక్టర్ కు ఆయన వివరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ (ఆర్ బి అండ్ ఆర్ )శ్రీ జె.వెంకట మురళి, తదితరులు పాల్గొన్నారు.