4రోజులు సచివాలయాలకి వెళ్లండి..


Ens Balu
4
GVMC office
2021-07-07 14:09:12

మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాలను జోనల్ కమిషనర్లు వారంలో 4 రోజులు తప్పని సరిగా సందర్శించాలని జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన జివిఎంసి ఆదేశించారు.  బుధవారం ఈ మేరకు ఉన్నతాధికారులు, జోనల్ కమిషనర్లు, వార్డు ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  ప్రజల వద్దకే సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా సచివాలయ వ్యవస్థను  ప్రవేశపెట్టిందని, దానిని నిర్వీర్యం అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మన మీదే ఉందని తెలిపారు. ప్రతి ఉన్నతాధికారి వారంలో నాలుగు రోజులు, వార్డు ప్రత్యేక అధికారులు రెండు రోజులు సచివాలయాన్ని సందర్శించి, సచివాలయాల్లో ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాలు వివరాలు చార్ట్ రూపంలో ప్రదర్శించాలని, అత్యవసర సేవల ఫోన్ నెంబర్లు, అన్ని రకాల రిజిస్టర్లు,  కోవిడ్ పోస్టర్లు, కంప్యూటర్ల పనితీరు, ప్రజలు పెట్టుకున్న ఆర్జీల వివరాలు, 2021-22 క్యాలెండర్, వై.ఎస్.ఆర్. బీమా, మత్స్యకారుల భీమా పనితీరును, బయోమెట్రిక్ హాజరు విదానం, సిబ్బంది డైరీ, మూమెంట్ రిజిస్టర్ తదితర వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. మురికివాడల అభివృద్ధి పై 10వ తేదీన అందరికీ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, 11వ తేదీ నుండి ఎన్యుమరేషణ్ మొదలు పెట్టాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో హాజరుకాని వార్డు ప్రత్యేక  అధికారులపై ఆగ్రహం వ్యక్తపరుస్తూ, వారికి ఛార్జ్ మెమో ఇవ్వాలని  కమిషనర్ ఆదేశించారు.