శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ - 19 నివారణకు డాక్టర్ బి.ఆర్. అంభేథ్కర్ యూనివర్సిటీ సిబ్బంది ఒక రోజు వేతనం విరాళంగా ఇచ్చినట్లు వైస్ ఛాన్సలర్ ఆచార్య ఎన్. వెంకటరావు వెల్లడించారు. యూనివర్సిటీ సిబ్బంది అందరూ ఒక రోజు వేతనం చెక్కును కలెక్టర్ కార్యాలయం ఆయన చాంబర్ లో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ కు వి.సి. అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యూనివర్శిటీ తరపున జిల్లా యంత్రాగంతో భాగస్వాములై కోవిడ్ నియంత్రణలో పాల్గొంటున్నామన్నారు. తమవంతు సహకారంగా ఈ విరాళాన్ని అందించినట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూనివిర్శిటీ ఆచార్యలు పాల్గొన్నారు.