శ్రీకాకుళం జిల్లాకి 175 డిజిటల్ లైబ్రరీలు మొదటి దశలో మంజూరు అయ్యాయని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివ్రుద్ధి కార్యక్రమాలపై బుధవారం మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, డిజిటల్ లైబ్రెరీలకు జూలై 20 నాటికి స్థలం సేకరించి భవన నిర్మాణం ప్రారంభించాలని ఆయన ఆదేశించారు. అంతేకాకుండా విభిన్న ప్రతిభావంతుల పరికరాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు, మూడు నెలలుగా మండలాల్లో పరికరాలు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్. కూర్మారావు మాట్లాడుతూ జగనన్న పచ్చ తోరణం క్రింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టామన్నారు. మండలాల వారీగా ఇచ్చిన లక్ష్యాలను అదిగమించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్లు డా. కె.శ్రీనివాసులు, ఆర్. శ్రీరాములు నాయుడు, అర్.డి.ఓ ఐ.కిశోర్, జిల్లా పరిషత్ సీఈఓ బి. లక్ష్మీపతి, జిల్లా పంచాయతీ అధికారి వి. రవి కుమార్, ఆర్ అండ్ బి ఎస్.ఇ కె.కాంతిమతి, పంచాయతీ రాజ్ ఎస్.ఇ బ్రహ్మయ్య తదితులు పాల్గొన్నారు.