ప్రాజెక్టులు పరిశీలించిన కమిషనర్..
Ens Balu
1
విశాఖ సిటీ
2021-07-07 15:07:06
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలో చేపడుతున్న ప్రాజెక్టులు, పార్కుల అభివృద్ధి పనులను జివిఎంసి కమిషనర్ డా. జి. సృజన పరిశీలించారు. బుధవారం ఆమె కాపులుప్పాడలోని డంపింగ్ యార్డ్ లో చెత్త నుండి చేపట్టే పలు ప్రాజెక్టులు, విద్యుత్ శ్చక్తి ప్లాట్ ఫామ్ నిర్మాణము, చెత్త తొలగించి భూమిని చదును చేసే మైనింగ్ ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. “సి&డి” వేస్ట్ ప్రాజెక్టు పనులను పరిశీలించి నిర్దేశించిన కాల పరిమితి లోగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న “రాక్ డే లే-అవుట్” పార్కును “జెన్” పార్కు గా అభివృద్ధి చేయడంలో భాగంగా పార్కు పనులను పరిశీలించి, ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తేవాలని, పార్కులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి లైటింగ్ సిస్టం ఏర్పాటు చేయాలని మిగిలిన పనులను ఆగస్టు 1వ తేదీ నాటికి పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అదనపు కమిషనర్ డా. వి. సన్యాసి రావు, ఎ.డి.హెచ్. ఎం. దామోదర రావు, పర్యవేక్షక ఇంజినీరు వేణుగోపాల్, కార్య నిర్వాహక ఇంజినీర్లు మెహర్ బాబా, రాయల్ బాబు ఇతర అధికారులు పాల్గొనారు.