రూ.3.3కోట్లతో ఆక్సిజన్ పైప్ లైన్లు..
Ens Balu
3
Kakinada
2021-07-07 15:17:46
తూర్పుగోదావరి జిల్లాలో రూ.3.3 కోట్లతో ఆసుపత్రులలో ఆక్సిజన్ పైపులైన్లను ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి తెలిపారు. బుధవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో ఆసుపత్రులలో ఆక్సిజన్ పైపులైన్ల పనల పై ఆరోగ్యశ్రీ అధికారులు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫాస్ట్రక్చర్ డౌలప్మేంట్ కార్పొరేషన్ (APMSIDC) జిల్లా అధికారులతో జేసీ కీర్తి చేకూరి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ జిల్లాలో 50 ఆ పైన పడకలు సంఖ్య కలిగి ఆసుపత్రులు , కాకినాడ సామాన్య ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ. 3.3 కోట్లతోను , 30 పడకలు ఆ పైన సంఖ్య కలిగిన ఆసుపత్రులలో సియస్ఆర్ నిధులతోను ఆక్సిజన్ పైపులైన్ల ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ఆక్సిజన్ పైపులైన్ల పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను జేసీ కీర్తి చేకూరి ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఆరోగ్యశ్రీ సమన్వకర్త డా పి.రాథాకృష్ణ , మేనేజర్ కే. నవీన్,డా.భూషణం , ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ సీతారామరాజు, జేఈలు చక్రవర్తి , శేషగిరిరావు , యోగి ,కాంట్రాక్టర్లు, ఇతర అధికారులు హజరయ్యారు.