మత్స్యకారులు,ఆక్వా రైతుల అభివ్రుద్ధే ధ్యేయంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. గురువారం విజయనగరంలో రూ. 47.30 లక్షల వ్యయంతో నిర్మించిన ఆక్వా ల్యాబ్ ను ఆమె ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి, జిల్లా కలెక్టర్ డా.హరిజవహర్ లాల్, మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారిల తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్య మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం “వై.ఎస్.ఆర్, మత్స్యకార భరోసా” పధకం ద్వారా అనేక కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా.. ఆ మహానేత గుర్తుగా ఆక్వాల్యాబ్ ప్రారంభించడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు. ఆక్వా రంగాన్ని ప్రోత్సహించడానికి, నాణ్యమైన సీడ్, ఫీడ్, ఆక్వా కల్చర్ అనుమతులు పొందడం కోసం రాష్ట్రంలో మూడు చట్టాలును (ఆంధ్రప్రదేశ్ ఫిష్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ ఆక్వాకల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) (సవరణ) యాక్ట్ 2020, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ చట్టం 2020) వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని గుర్తుచేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, మత్స్యకారులు, ఆక్వా రైతులందరికీ ఆక్వా లాబ్ సేవలు అందిచడం ద్వారా వారి యొక్క ఉత్పాదకతను అధికంగా పెంచుకోవడానికి వీలుపడుతందని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం రాష్ట్రంలో ఎనిమిది ఇంటిగ్రేటెడ్ ఆక్వా లాబ్ లు, అయిదు ఆక్వా ల్యాబ్ లను ఆధునీకరించిందన్నారు. మత్స్యశాఖ డిడి నిర్మల కుమారి మాట్లాడుతూ, ఈ ఆక్వా ల్యాబ్ ద్వారా విజయనగరం జిల్లాలో గల 67మంది ఆక్వా రైతులు, 52 స్వదేశీ మత్స్యకార సహకార సంఘాలకు సేవలు అందుతాయన్నారు. ఈ ఆక్వాల్యాబ్ లో మట్టిని, నీటిని, మేత కోసం పరీక్షలు చేస్తారని వివరించారు. అలాగే చేపలకు వచ్చిన లేదా రాబోయే వ్యాధులను తెలుసుకొని వాటికి నియంత్రిణ చర్యలు చేపట్టి ఆక్వా రైతులు, మత్స్యకారుల నష్టాలను తగ్గించుకో వచ్చునని వివరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలక్టర్ జి.సి. కిషోర్ కుమారు, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షులు మరియు FISHCOPFED, డైరెక్టర్ బర్రి చిన్నప్పన్న, మత్స్య శాఖ సహాయ సంచాలకులు పి. కిరణ్ కుమార్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి యు.చాందిని, మత్స్యకార సహకార సంఘాల అధ్యక్షులు, సభ్యులు, మత్స్యకారులు, ఆక్వా రైతులు, మత్స్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.