జిల్లాలో ఘనంగా రైతు దినోత్సవం..


Ens Balu
2
Srikakulam
2021-07-08 14:34:59

శ్రీకాకుళం జిల్లాలో రైతు దినోత్సవం గురు వారం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం  దివంగత ముఖ్య మంత్రి స్వర్గీయ వై.యస్.ఆర్.రాజశేఖర రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం విదితమే. రైతు దినోత్సవం గురు వారం ఉదయం నుంచి అంగరంగ వైభవంగ జరిగింది. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ పోలాకి మండలం ఈదులవలసలో ఉదయం 8 గంటలకే కార్యక్రమంలో పాల్గొని రూ.21.80 లక్షలతో సుందరంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అచ్చట నుండి నరసన్నపేట మండలం కరగాం గ్రామంలో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, వై.యస్.ఆర్ వెల్ నెస్ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారం ఆమదాలవలస వ్యవసాయ మార్కెటింగు యార్డులో రూ.61 లక్షలతో నిర్మించిన వై.యస్.ఆర్ అగ్రి లాబ్ ను ప్రారంభించారు. రాజాంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారం స్ధానిక శాసన సభ్యులు కంబాల జోగులు, జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పాల్గొన్నారు. రైతు దినోత్సవంలో భాగంగా వై.యస్.ఆర్ యంత్ర సేవ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు యంత్రాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. జిల్లాలో 134 రైతు భరోసా కేంద్రాలు, 140 యంత్ర సేవా కేంద్రాలు, నాలుగు అగ్రి లాబ్ లు గురు వారం ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో జరిగిన రైతు దినోత్సవ కార్యక్రమాల్లో సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసగించిన ఉప ముఖ్య మంత్రి క్రిష్ణదాస్, స్పీకర్ సీతారాం ప్రజలకు స్ఫూర్తిదాయక సూచనలు చేసారు. దివంగత రాజశేఖర రెడ్డి వ్యవసాయాన్ని పండగ చేసారన్నారు. ప్రతి రైతు ముఖంలో ఆనందం చూడాలని రాజశేఖర రెడ్డి ఆలోచించగా రాజశేఖర రెడ్డి తనయుడు జగన్ మోహన్ రెడ్డి రైతు జీవితాలు మరింత మెరుగుపడాలని ఆశిస్తున్నారని పేర్కొన్నారు. రైతు భరోసా అందిస్తున్నారని, రైతులకు అవసరమగు అన్ని సౌకర్యాలు అందించుటకు రైతు భరోసా కేంద్రాలను గ్రామ సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసారని తెలిపారు. అగ్రీ లాబ్ లను ఏర్పాటు చేసి నాణ్యమైన విత్తనాలు అందుటకు తద్వారా రైతు లాభదాయక విధానంలో వెళ్ళుటకు అన్ని చర్యలు చేపడుతున్నారని ఆయన చెప్పారు. రైతు దేశానికి వెన్నెముక అన్నారు. రైతు బాగుంటే దేశం బాగుంటుందన నమ్మిన వ్యక్తి ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు.