మహానేత వైఎస్సార్ కి ఘన నివాళి..


Ens Balu
2
విశాఖ సిటీ
2021-07-08 15:18:58

మహా నేత,  బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్గీయ డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి 72వ జయంతి సందర్భంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా వైఎస్సార్  విగ్రహానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ నగర అధ్యక్షులు వంశీక్రిష్ణ శ్రీనివాస్ తో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, మహా నేత ఆంధ్రుల ఆరాధ్య దైవము, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ఈ ధరణి ఉన్నంతవరకు ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచి ఉంటారని, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి, ప్రజలకు ఎనలేని సేవ చేశారని, విశాఖ అభివృద్దికి మూలకారకుడు అని,  విశాఖకు ఎన్నో ప్రాజెక్టులను ప్రారంభించి విశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.