సిబ్బందికి మాస్కులు, మిఠాయిలు పంపిణీ..


Ens Balu
1
విశాఖ సిటీ
2021-07-08 15:22:01

స్వర్గీయ డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి, 72వ జయంతి సందర్భంగా మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి జివిఎంసి  ప్రధాన కార్యాలయం సిబ్బందికి మాస్కులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వర్గీయ వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఎంతో అభివృద్ధి చేశారని,  అందులో భాగంగా మన విశాఖను ప్రత్యేకంగా అభివృద్ధి పరచడంలో ఆయన కృషి ఎంతో ఉందని, హనుమంతువాక జంక్షన్ నుండి అడవివరం వరకు  విశాఖ నుండి పెందుర్తి జంక్షన్ వరకు బిఆర్టిఎస్ రోడ్డును అభివృద్ధి పరిచిన ఘనత ఆయన దేనని కొనియాడారు.  ఈ  కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి కె.ఎస్.ఎల్.జి.శాస్త్రి, జివిఎంసి సిబ్బంది పాల్గొన్నారు.  

సిఫార్సు