కేజీ చందనం సమర్పించిన భక్తులు..


Ens Balu
3
Simhachalam
2021-07-09 12:43:39

సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీ న్రుసింహస్వామివారికి విశాఖ రవీంద్రనగర్ కు చెందిన బాబురావు - సత్యవతి దంపతులు శుక్రవారం అరకేజీ చందనం సమర్పించారు. అదేవిధంగా బోయపాలెం వాస్తవ్యులు  ఈశ్వరరావు-లక్ష్మి దంపతులు మరో అరకేజీ చందనం సమర్పించారు. ఈ మేరకు రూ.10,116 (పదివేల నూట పదహారు) చొప్పున ఏఈఓ రాఘవకుమార్ అందించి రసీదు పొందారు. అనంతరం దాతలకు స్వామివారిని దర్శించుకొని తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. కప్పస్థంబాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.