సత్వరమే ప్రజలకు సేవలందాలి..
Ens Balu
3
విశాఖ సిటీ
2021-07-09 13:11:24
మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల్లో ప్రజలకు జాప్యంలేని సేవలు అందాలని అదనపు కమిషనర్ డా. వి. సన్యాసిరావు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం నాలుగవ జోన్ అల్లిపురం పరిధిలోని రెండు సచివాలయాలను ఆయన సందర్శించారు. ఈ సంరద్భంగా సచివాలయ సిబ్బంది హాజరు, వారి డైరీ, మూమెంట్ రిజిస్టర్, ప్రజలు పెట్టుకున్న ఆర్జీలను, సచివాలయంలోని వివిధ సేవలకు సంబంధించిన పోస్టర్లును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టారని, వాటికి అనుగుణంగా కార్యదర్శి విధులు నిర్వర్తించాలని, విధి నిర్వహణలో ఎటువంటి అలసత్వం ప్రదర్శించరాదని, నిర్ణయించిన సమయానికే విధులకు హాజరు కావాలని, ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా సచివాలయంలో వివిధ సేవలకు సంబంధించిన సేవా పోస్టర్లను, కోవిడ్ నియంత్రణా నియమావళి పోస్టులను, ప్రభుత్వ సేవల ఫోన్ నెంబర్లను ప్రదర్శించాలని సిబ్బందిని ఆదేశించారు.