స్వామివారి భక్తులకు పూర్తి ఏర్పాట్లు..


Ens Balu
2
Simhachalam
2021-07-09 13:32:06

శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి దర్శించుకోవడానికి వచ్చే  భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం ఈఓ ఎంవీ సూర్యకళ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లు, సదుపాయాలను ఆమె స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ, సర్వదర్శనం, వంద రూపాయల క్యూలైన్లలో లోపాలను సరిచేయాలన్నారు. మాక్ డ్రిల్ తరహాలో ట్రయల్ రన్ వేశామని వివరించారు. అనంతరం సెల్ ఫోన్లు చెప్పులు, బ్యాగులు భద్రపరుచుకునే కౌంటర్లను పరిశీలించారు. ఒకేసారి వేలాదిమంది భక్తులొచ్చినా వారికి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దైవదర్శనం చేసుకునేలా చూడాలన్నారు.   దేవస్థానం ఈఓతోపాటు ఈఈ శ్రీనివాసరాజు, ఏఈఓ రమణమూర్తి ఇతర ఈఓ పర్యటనలో పాల్గొన్నారు.